ఒక్కోసారి ఒకరిమీద కోపాన్ని ఇంకొకరిపై చూపిస్తూ ఉంటాం..
అది తప్పు అని తెలుసు కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోలేం...
చాలా మాటలు అనేస్తాం.. ఆ తర్వాత బాధ పడతాం..
అనేసాక బాధపడి ఏం లాభం...
ఒక్కోసారి మంచి స్నేహితులను, బంధాలను కూడా కోల్పోతాం...
అందుకే ఆలోచన లేని కోపంతో బంధాలను శాశ్వతంగా కోల్పోయేకంటే కొంచెం సేపు కోపాన్ని అదుపు చేసుకుని వాళ్ళకి దూరంగా ఉంటే బంధాలను కోల్పోకుండా నిలబెట్టుకోవచ్చు....!!!